రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం అల్లావాడ గేట్ సమీపంలో ఆర్మీకి చెందిన వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. గోల్కొండ ఆర్మీ క్యాంపు నుంచి షాబాద్‌లోని శిక్షణ కేంద్రానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 14 మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఎనిమిది మంది జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులైన జవాన్లను అంబులెన్స్‌లో గోల్కొండ ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.