Find Articles

డిసెంబర్ 14న ఢిల్లీలో బీసీల జనభేరి.. జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటన

డిసెంబర్ 14న ఢిల్లీలో బీసీల జనభేరి.. జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటన

బీసీల హక్కుల సాధన కోసం డిసెంబర్ 14న ఢిల్లీలో భారీ బీసీల జనభేరి నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

గురువారం హైదరాబాద్‌లో జనభేరికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. రాబోయే జనగణనలో ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్‌ను చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రం స్పందించకపోతే దేశవ్యాప్తంగా జనగణనను బహిష్కరిస్తామని హెచ్చరించారు.

ఈ జనభేరి కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలకు చెందిన బీసీ నాయకులు పాల్గొంటారని వెల్లడించారు. ఇదే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులపై జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శలు చేశారు.

ManaTV Team