Find Articles

అమెరికాలో నవీన్ పోలిశెట్టి సందడి.. ప్రభాస్‌తో స్నేహంపై ఆసక్తికర వ్యాఖ్యలు!

అమెరికాలో నవీన్ పోలిశెట్టి సందడి.. ప్రభాస్‌తో స్నేహంపై ఆసక్తికర వ్యాఖ్యలు!

అమెరికాలోని షార్లెట్ నగరం వేదికగా వైభవంగా జరుగుతున్న ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (TTA) మెగా కన్వెన్షన్ 2026 వేడుకల్లో యువ హీరో, టాలెంటెడ్ నటుడు నవీన్ పోలిశెట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదికపై తనదైన చమత్కారం, కామెడీ టైమింగ్‌తో అభిమానులను, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. షార్లెట్‌కు మళ్లీ రావడంపై తన మార్క్ హెల్తీ కామెడీతో సందడి చేశారు. “నేను పుట్టిన ఊరు ఇదేనండి.. కాకపోతే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోవడంతో ఇండియాకు వెళ్లాల్సి వచ్చింది” అని సరదాగా అనడంతో ఆడిటోరియంలో నవ్వుల పువ్వులు పూశాయి. రెబెల్ స్టార్ ప్రభాస్ గారితో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. వారిద్దరి స్నేహం గురించి అడగ్గా నవీన్ స్పందిస్తూ:తమ ఇద్దరిదీ ఇప్పటి స్నేహం కాదని, చిన్ననాటి మిత్రులమని వెల్లడించారు. ప్రభాస్ గారితో ఉన్న అనుబంధం, తమ ఫ్రెండ్‌షిప్ ముచ్చట్ల గురించి చెప్పాలంటే ఒక గంట సమయం ఉండే పాడ్‌కాస్ట్ (Podcast) కూడా సరిపోదని చమత్కరించారు.

 

ManaTV Team