Categories: Movie News

రియల్ లైఫ్ హీరోగా అల్లు అర్జున్.. ఎనిమిదేళ్ల చిన్నారి కోసం స్పెషల్ గిఫ్ట్!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నారు. బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్న శ్రద్ధ అనే ఎనిమిదేళ్ల చిన్నారి కోరికను ఆయన నెరవేర్చారు. చిన్నారితో అల్లు అర్జున్ జరిపిన వీడియో కాల్ సంభాషణకు సంబంధించిన విజువల్స్‌ను ఆయన పిఆర్ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సినిమా రంగానికి బయట కూడా నవ్వులు పూయించడమే తమ ఉద్దేశమని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల చివరి కోరికలను తీర్చే ‘మేక్-ఎ-విష్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ సంస్థ ప్రతినిధులు జూన్ 19న అల్లు అర్జున్ కార్యాలయాన్ని సంప్రదించారు. దీంతో ఆయన వెంటనే స్పందించారు. ఆ చిన్నారితో వీడియో కాల్ మాట్లాడారు. శ్రద్ధను నవ్వుతూ పలకరిస్తూ.. తన ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని ఐకానిక్ డైలాగులను చెప్పమని ప్రోత్సహించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి స్క్రీన్‌పై ఒకేసారి ‘గడ్డం కింద చేయి తిప్పే’ మేనరిజంను చేశారు.. చిన్నారి చేసిన ఆ క్యూట్ యాక్షన్‌ను చూసి బన్నీ గట్టిగా చప్పట్లు కొడుతూ ‘డ్యామ్ క్యూట్’ అని మెచ్చుకున్నారు. భవిష్యత్తులో ఏం కావాలని అనుకుంటున్నావని అడగ్గా.. తాను డాక్టర్ అవుతానని ఆ చిన్నారి సమాధానమిచ్చింది. ఈ క్రమంలోనే శ్రద్ధ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన బన్నీ ఆమె ఆరోగ్యం కుదుటపడిన తర్వాత కచ్చితంగా హైదరాబాద్ వచ్చి తనను కలవాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న ‘రాకా’ అనే సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మరోవైపు జూన్ 22న అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. 2024లో ‘పుష్ప 2: ది రూల్’ స్పెషల్ స్క్రీనింగ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసుకు సంబంధించి ఆయన కోర్టు ఎదుట హాజరుకానున్నారు. ఓ వైపు ఈ కేసులో లీగల్ ప్రాసెస్ నడుస్తున్నప్పటికీ, తీవ్ర అనారోగ్యంతో ఉన్న చిన్నారి ముఖంలో నవ్వులు పూయించడానికి ఆయన చూపించిన చొరవను నెటిజన్లు కొనియాడుతున్నారు.

ManaTV Team

Recent Posts

కొడుకు కోసం కాజల్ అగర్వాల్ డెసిషన్..!

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం 'ది ఇండియా…

4 hours ago

విజయ్ ‘జన నాయగన్’ సెన్సార్ రిపోర్ట్..క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ

తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తయి ‘ఏ’…

5 hours ago

యాక్షన్ మోడ్‌లోకి చిరు.. హైదరాబాద్‌లో భారీ ఫైట్ సీక్వెన్స్ షురూ

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం 'మెగా158' (వర్కింగ్ టైటిల్).జూన్ 22న హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్…

5 hours ago

జెట్ స్పీడ్ లో అనిల్ రావిపూడి సినిమా.. షూటింగ్ లో పాల్గొన్న వెంకీ

టాలీవుట్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేశ్‌, నందమూరి కల్యాణ్‌రామ్‌ కలిసి నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్‌ జెట్ స్పీడ్ లో…

6 hours ago

బిగ్ సర్‎ప్రైజ్.. ‘లెనిన్’ కు ఎన్టీఆర్ వాయిస్

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘లెనిన్’. తాజాగా ఈ చిత్రానికి…

9 hours ago

సైకో మైండ్.. సియా గోయల్ పై సింగర్ సుచిత్ర షాకింగ్ కామెంట్స్!!

పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ చర్యలను సమర్థించేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన…

10 hours ago