Find Articles

‘పెద్ది’ సినిమా కోసం పవన్ కల్యాణ్ స్పెషల్ వీడియో!

‘పెద్ది’ సినిమా కోసం పవన్ కల్యాణ్ స్పెషల్ వీడియో!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ చిత్రానికి మద్ధతు తెలిపారు. ‘ పెద్ది’ మూవీ టీమ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ‘ఎక్స్’ వేదికగా విడుదలైన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో రామ్ చరణ్ సినీ ప్రయాణంలోని ముఖ్యమైన సన్నివేశాలు ఉన్నాయి. రామ్ చరణ్ పేరులోనే శ్రీరామ భక్తుడైన ఆంజనేయుడి లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన భక్తి, శక్తితో పాటు సమర్పణ భావాలకు ప్రతీకని తెలిపారు. ఈ పోలిక మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. పెద్ది సినిమా ఘన వియం సాధించి, ప్రేక్షకులను ఆలరించాలని పవన్ కల్యాణ్ తన వీడియోలో ఆకాంక్షించారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉండగా, పవన్ కల్యాణ్ విడుదల చేసిన ఈ వీడియోతో అంచనాలు మరింత పెరిగాయి.

ManaTV Team