Categories: Andhra Pradesh

ఈగో లేకుండా ప్రజల కోసం పనిచేయాలి: సీఎం చంద్రబాబు

అమరావతి: ఈగోలకు దూరంగా ఉంటూ ప్రజల కోసం పనిచేసి నిజమైన ప్రజా సేవకులుగా నిలవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చారు. గురువారం అమరావతిలో నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన పలు కీలక అంశాలపై అధికారులతో చర్చించారు.

సదస్సులో లీడర్‌షిప్, జీఎస్‌డీపీ, తాగునీరు, గృహ నిర్మాణం, జలధార, బెస్ట్ ప్రాక్టీసెస్ తదితర అంశాలపై చర్చ జరిగింది. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకుని పరిష్కరించేందుకు కలెక్టర్లు ప్రజలను నేరుగా కలవాలని సీఎం సూచించారు.

కేవలం రివ్యూలకే పరిమితం కాకుండా “రివ్యూల నుంచి రిజల్ట్స్ వైపు” అడుగులు వేయాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు ప్రజలకు స్పష్టంగా కనిపించేలా పనిచేయాలని సూచించారు.

“వన్ స్టేట్ – వన్ మిషన్ – వన్ ఎయిమ్” అనే లక్ష్యంతో అధికారులు సమన్వయంతో పనిచేసి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు

ManaTV Team

Recent Posts

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు.. ముగ్గురు సీనియర్ అధికారుల అదుపులోకి?

సికింద్రాబాద్‌ బొల్లారంలోని 20 మద్రాస్‌ రెజిమెంట్‌ బెటాలియన్‌లో ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ…

4 hours ago

రాకా’లో విల్ స్మిత్? వైరల్ అవుతున్న BTS పిక్‌తో మరింత పెరిగిన అంచనాలు

భారతీయ సినీ పరిశ్రమ నుంచి తెరకెక్కుతున్న భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ **‘రాకా’ (Raaka)**పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఐకాన్ స్టార్…

4 hours ago

జెలెన్‌స్కీకి త్రుటిలో తప్పిన పెనుప్రమాదం.. విమానానికి అత్యంత సమీపంలోకి డ్రోన్

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీకి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. మాల్డోవా నుంచి నార్వేకు బయలుదేరిన సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం…

4 hours ago

10,000 Police Posts to Be Filled Soon: Minister #naralokesh #policejobs2026 #manatv

10,000 Police Posts to Be Filled Soon: Minister #naralokesh #policejobs2026 #manatv #NaraLokesh #PoliceRecruitment #PoliceJobs #10KPoliceJobs…

8 hours ago

జయాపజయాలను సమానంగా చూడటమే నిజమైన యోగం | భగవద్గీత #bhagavadgita #lordkrishna #manatv

జయాపజయాలను సమానంగా చూడటమే నిజమైన యోగం | భగవద్గీత #bhagavadgita #lordkrishna #manatv #BhagavadGita #LordKrishna #KrishnaTeachings #GitaQuotes #BhagavadGitaQuotes…

10 hours ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 10-09-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 10-09-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…

11 hours ago