
అమెరికాలో తెలుగు సంస్కృతి, సాహిత్య పండగకు వేళయింది. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు బాల్టీమోర్ నగరంలో 19వ మహాసభలు ఘనంగా జరగనున్నాయి. ఈ మహాసభల సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు నవలల పోటీలతో పాటు, అమెరికాలోని వివిధ నగరాల్లో కథలు, కవితల పోటీలను ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 1, 2 తేదీల్లో పుస్తకావిష్కరణలు, అవధానాలు, ప్రముఖ వక్తల ప్రసంగాలు మరియు బహుమతి ప్రదానోత్సవం ఉంటాయని ఆటా సాహిత్య విభాగం కమిటీ చైర్మన్ వేణు నక్షత్రం తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రవేశం పూర్తిగా ఉచితం. మరిన్ని వివరాలకు ఆటా అధికారిక వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
