అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ ATA కాన్ఫరెన్స్ & కన్వెన్షన్ సందర్భంగా ‘సయ్యంది పాదం-2026’ పేరుతో నృత్య పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు సోలో, గ్రూప్ విభాగాలతో పాటు శాస్త్రీయ, శాస్త్రీయేతర విభాగాల్లో జరగనున్నాయి. భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ, కథాకళి, మణిపురి, మోహినీఅట్టం వంటి నృత్యాలు, శాస్త్రీయేతర విభాగంలో సినిమా, జానపద, లైట్ మ్యూజిక్ పాటలపై ప్రదర్శనలుంటాయి. తొలుత అమెరికాలోని వివిధ నగరాల్లో సెమీఫైనల్స్ నిర్వహించనున్నారు. ఇందులో విజేతలను ఎంపిక చేస్తారు. సెమీఫైనల్స్‌లో విజయం సాధించిన వారు 2026 జులై 31, ఆగస్టు 1, 2 తేదీల్లో అమెరికాలోని బాల్టిమోర్‌లో జరిగే 19వ ATA కాన్ఫరెన్స్‌లో ఫైనల్‌లో పాల్గొంటారు. భారతీయ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నృత్య దర్శకులు ఫైనల్‌కు హాజరుకానున్నారు. ఈ పోటీలను తిలకించేందుకు పెద్దఎత్తున అమెరికాలోని తెలుగు ప్రజలు తరలిరావాలని నిర్వాహకులు కోరుతున్నారు.
టాలీవుడ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDDA) కీలక నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్‌లో ఖాళీగా ఉన్న పదవులకు ఉప ఎన్నికలు నిర్వహించాలని…
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచే 30వ సినిమా కోసం రెడీ అవుతున్నారు. 'RL-30'…
అమెరికాలోని తెలుగు వారిని ఒకే వేదికపైకి తెచ్చే ప్రతిష్ఠాత్మక 'అమెరికన్ తెలుగు అసోసియేషన్' 19వ మహాసభలకు బాల్టిమోర్ నగరం సిద్ధమవుతోంది.…
సీనియర్ నటుడు శ్రీకాంత్, ప్రముఖ నటి లయ ప్రధాన పాత్రల్లో నటించిన 'మిస్టర్ మిడిల్ క్లాస్' చిత్రం ప్రేక్షకుల ముందుకు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు' నుంచి రెండో సింగిల్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర…
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్–2026లో భాగంగా జులై 19న అమెరికా రాజకీయాలు, ప్రజా విధానాలపై ప్రత్యేక…