టాలీవుడ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDDA) కీలక నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్‌లో ఖాళీగా ఉన్న పదవులకు ఉప ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది.
అసోసియేషన్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ జులై 20 నుంచి ప్రారంభం కానుంది. అదే రోజు నామినేషన్ల స్వీకరణతో పాటు పరిశీలన కూడా చేపట్టనున్నారు.
జులై 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగానే మొత్తం ప్రక్రియ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ స్పష్టం చేసింది.
ఇటీవల అసోసియేషన్‌లో చోటుచేసుకున్న వివాదాల నేపథ్యంలో కొంతమంది సభ్యులపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఖాళీ అయిన పదవులను భర్తీ చేసేందుకు ఉప ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అసోసియేషన్ సభ్యుల భాగస్వామ్యంతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ ATA కాన్ఫరెన్స్ & కన్వెన్షన్ సందర్భంగా 'సయ్యంది పాదం-2026' పేరుతో…
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచే 30వ సినిమా కోసం రెడీ అవుతున్నారు. 'RL-30'…
అమెరికాలోని తెలుగు వారిని ఒకే వేదికపైకి తెచ్చే ప్రతిష్ఠాత్మక 'అమెరికన్ తెలుగు అసోసియేషన్' 19వ మహాసభలకు బాల్టిమోర్ నగరం సిద్ధమవుతోంది.…
సీనియర్ నటుడు శ్రీకాంత్, ప్రముఖ నటి లయ ప్రధాన పాత్రల్లో నటించిన 'మిస్టర్ మిడిల్ క్లాస్' చిత్రం ప్రేక్షకుల ముందుకు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు' నుంచి రెండో సింగిల్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర…
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్–2026లో భాగంగా జులై 19న అమెరికా రాజకీయాలు, ప్రజా విధానాలపై ప్రత్యేక…