Categories: Movie News

లారెన్స్ కొత్త సినిమాలో నలుగురు టాప్ హీరోయిన్లు?

ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచే 30వ సినిమా కోసం రెడీ అవుతున్నారు. ‘RL-30’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్‌ను ఇటీవలే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభం కాకముందే క్యాస్టింగ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు టాప్ హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తోంది.

ఈ భారీ చిత్రంలో సాయి పల్లవి, జాన్వీ కపూర్, రుక్మిణి వసంత్ తో పాటు కయాదు లోహర్ కీలక పాత్రలు పోషించనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నలుగురు నటీమణులకు ఉన్న క్రేజ్ దృష్ట్యా సౌత్ ఇండియన్ సినిమాలో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. దాంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాను రాఘవ లారెన్స్ తన సొంత నిర్మాణ సంస్థ ‘రాఘవేంద్ర ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై నిర్మిస్తుండటం విశేషం.

తిరుపుగల్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై హీరోయిన్ల వార్తతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ManaTV Team

Recent Posts

అమెరికాలో కళల సంబరం.. ATA ‘సయ్యంది పాదం’ ఫైనల్‌కు రంగం సిద్ధం

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ ATA కాన్ఫరెన్స్ & కన్వెన్షన్ సందర్భంగా 'సయ్యంది పాదం-2026' పేరుతో…

6 hours ago

టాలీవుడ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నిర్ణయం.. ఉప ఎన్నికలకు రెడీ

టాలీవుడ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDDA) కీలక నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్‌లో ఖాళీగా ఉన్న పదవులకు ఉప ఎన్నికలు నిర్వహించాలని…

7 hours ago

ఈ నెల 31 నుంచి ‘అమెరికన్ తెలుగు అసోసియేషన్’ మహాసభలు

అమెరికాలోని తెలుగు వారిని ఒకే వేదికపైకి తెచ్చే ప్రతిష్ఠాత్మక 'అమెరికన్ తెలుగు అసోసియేషన్' 19వ మహాసభలకు బాల్టిమోర్ నగరం సిద్ధమవుతోంది.…

14 hours ago

థియేటర్లలోకి ‘మిస్టర్ మిడిల్ క్లాస్’.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై అంచనాలు

సీనియర్ నటుడు శ్రీకాంత్, ప్రముఖ నటి లయ ప్రధాన పాత్రల్లో నటించిన 'మిస్టర్ మిడిల్ క్లాస్' చిత్రం ప్రేక్షకుల ముందుకు…

17 hours ago

‘కొరియన్ కనకరాజు’ నుంచి రెండో పాట… ‘రాస గుమ్మడి’ విడుదల తేదీ ఖరారు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు' నుంచి రెండో సింగిల్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర…

17 hours ago

TTA Mega Conventionలో యూఎస్ పొలిటికల్ ఫోరం.. అమెరికా రాజకీయాలపై ఆది రెడ్డి సాథి ప్రత్యేక ప్రసంగం

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్–2026లో భాగంగా జులై 19న అమెరికా రాజకీయాలు, ప్రజా విధానాలపై ప్రత్యేక…

1 day ago