మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ నుంచి రెండో సింగిల్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర బృందం ప్రకటించింది. ‘రాస గుమ్మడి’ పేరుతో రూపొందిన ఈ మాస్ సాంగ్ లిరికల్ వీడియోను జూలై 19న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
ఇప్పటికే విడుదలైన తొలి పాట ‘కమ్సహమ్నిదా’ కొరియన్ శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకోగా, రెండో పాట మాత్రం పూర్తి భిన్నంగా రాయలసీమ బీట్స్ నేపథ్యంలో ఉండనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను కూడా సోషల్ మీడియాలో విడుదల చేయగా, అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ తేజ్ సరసన దక్షా నగార్కర్ కథానాయికగా నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.
విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ‘కొరియన్ కనకరాజు’ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ ATA కాన్ఫరెన్స్ & కన్వెన్షన్ సందర్భంగా 'సయ్యంది పాదం-2026' పేరుతో…
టాలీవుడ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDDA) కీలక నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్‌లో ఖాళీగా ఉన్న పదవులకు ఉప ఎన్నికలు నిర్వహించాలని…
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచే 30వ సినిమా కోసం రెడీ అవుతున్నారు. 'RL-30'…
అమెరికాలోని తెలుగు వారిని ఒకే వేదికపైకి తెచ్చే ప్రతిష్ఠాత్మక 'అమెరికన్ తెలుగు అసోసియేషన్' 19వ మహాసభలకు బాల్టిమోర్ నగరం సిద్ధమవుతోంది.…
సీనియర్ నటుడు శ్రీకాంత్, ప్రముఖ నటి లయ ప్రధాన పాత్రల్లో నటించిన 'మిస్టర్ మిడిల్ క్లాస్' చిత్రం ప్రేక్షకుల ముందుకు…
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్–2026లో భాగంగా జులై 19న అమెరికా రాజకీయాలు, ప్రజా విధానాలపై ప్రత్యేక…