Categories: NRI Updates

ఈ నెల 31 నుంచి ‘అమెరికన్ తెలుగు అసోసియేషన్’ మహాసభలు

అమెరికాలోని తెలుగు వారిని ఒకే వేదికపైకి తెచ్చే ప్రతిష్ఠాత్మక ‘అమెరికన్ తెలుగు అసోసియేషన్’ 19వ మహాసభలకు బాల్టిమోర్ నగరం సిద్ధమవుతోంది. వేలాది మంది ఎన్ఆర్ఐ ప్రముఖులు, తెలుగు వారు పాలుపంచుకోనున్న ఈ కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్ష జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది.. ఈ మేరకు ఆటా కార్యవర్గం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఈ బాల్టిమోర్ కన్వెన్షన్‌లో బిజినెస్ సెమినార్లు హైలైట్‌గా నిలవనున్నాయి. దిగ్గజ వ్యాపారులు, ఇన్వెస్టర్లు, స్టార్టప్ ఫౌండర్ల సమక్షంలో B2B మ్యాచ్ మేకింగ్, ఎగ్జిక్యూటివ్ నెట్‌వర్కింగ్ సెషన్స్ నిర్వహించనున్నారు. జీ టీవీ 5 సహకారంతో ‘ఐడియా బాజ్’ వంటి వినూత్న కార్యక్రమాలు ఔత్సాహికులకు గొప్ప అవకాశంగా మారనున్నాయని తెలుస్తోంది. అలాగే మెడికల్ కాన్ఫరెన్స్‌లో వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం, హృద్రోగ, డయాబెటిస్, క్యాన్సర్ రీసెర్చ్‌పై నిపుణులు కీలక చర్చలు జరపనున్నారు.

అంతేకాదు ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా నిర్వహించే శ్రీ శివ పార్వతుల కళ్యాణం ఈ సభలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నిరావాల్ బ్యాండ్ లైవ్ కాన్సర్ట్, ఆటా బ్యూటీ పేజెంట్, లిటరరీ కాన్ఫరెన్సెస్, యూత్ క్రూయిజ్, ఫ్యాషన్ షో, అష్టావధానం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి.

1991లో స్థాపించబడిన ఆటా సంస్థ.. గత 35 ఏళ్లుగా ఎన్ఆర్ఐల కోసం ఎన్నో సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నో విపత్కర పరిస్థితుల్లో అమెరికాలోని తెలుగు వారికి అండగా నిలవడమే కాకుండా, మాతృభూమిలో వరదలు, కోవిడ్ వంటి విపత్తుల సమయంలో ‘ఆటా ఫౌండేషన్’ ఎనలేని వైద్య, విద్యా సేవలు అందించింది.

ManaTV Team

Recent Posts

అమెరికాలో కళల సంబరం.. ATA ‘సయ్యంది పాదం’ ఫైనల్‌కు రంగం సిద్ధం

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ ATA కాన్ఫరెన్స్ & కన్వెన్షన్ సందర్భంగా 'సయ్యంది పాదం-2026' పేరుతో…

6 hours ago

టాలీవుడ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నిర్ణయం.. ఉప ఎన్నికలకు రెడీ

టాలీవుడ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDDA) కీలక నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్‌లో ఖాళీగా ఉన్న పదవులకు ఉప ఎన్నికలు నిర్వహించాలని…

7 hours ago

లారెన్స్ కొత్త సినిమాలో నలుగురు టాప్ హీరోయిన్లు?

ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచే 30వ సినిమా కోసం రెడీ అవుతున్నారు. 'RL-30'…

10 hours ago

థియేటర్లలోకి ‘మిస్టర్ మిడిల్ క్లాస్’.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై అంచనాలు

సీనియర్ నటుడు శ్రీకాంత్, ప్రముఖ నటి లయ ప్రధాన పాత్రల్లో నటించిన 'మిస్టర్ మిడిల్ క్లాస్' చిత్రం ప్రేక్షకుల ముందుకు…

17 hours ago

‘కొరియన్ కనకరాజు’ నుంచి రెండో పాట… ‘రాస గుమ్మడి’ విడుదల తేదీ ఖరారు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు' నుంచి రెండో సింగిల్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర…

17 hours ago

TTA Mega Conventionలో యూఎస్ పొలిటికల్ ఫోరం.. అమెరికా రాజకీయాలపై ఆది రెడ్డి సాథి ప్రత్యేక ప్రసంగం

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్–2026లో భాగంగా జులై 19న అమెరికా రాజకీయాలు, ప్రజా విధానాలపై ప్రత్యేక…

1 day ago