‘బేబీ’ చిత్రంతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా నటించిన వెబ్ సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’. ఫీల్ గుడ్ స్కూల్ డేస్ జ్ఞాపకాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్, జులై 3 నుంచి ‘ఈటీవీ విన్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆడియెన్స్ నుంచి సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్ పెట్టారు. చిత్ర బృందానికి తన మద్దతు తెలిపారు.
ఈ సిరీస్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్ చంద్ర నాయుడు పూర్తిస్థాయి నిర్మాతగా పరిచయం అయ్యారు. శరత్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా అల్లు అర్జున్ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా బన్నీ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. “‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్ గురించి చాలా విషయాలు వింటున్నాను. నా ప్రియమైన శరత్ చంద్రకు, చిత్ర యూనిట్ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు. నువ్వు ఒక నిర్మాతగా నీ మొదటి అడుగు వేయడం చూడటం నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఈ అందమైన సిరీస్ ప్రేక్షకుల ప్రేమాభిమానాలు, ప్రశంసలతో పాటు గొప్ప విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. చిత్ర తారాగణానికి, సాంకేతిక నిపుణులందరికీ నా శుభాకాంక్షలు అంటూ బన్నీ తన పోస్ట్ లో రాసుకొచ్చారు.
వెబ్ సిరీస్ కు అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో నుంచి ప్రశంసలు, మద్దతు లభించడం చిత్ర యూనిట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అల్లు అర్జున్ పెట్టిన ఈ పోస్ట్‌తో ఈ సిరీస్‌పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాంటసీ ఎపిక్ చిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రం విడుదలపై తాజాగా ఆసక్తికర వార్తలు…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరుడి కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ దేశంలోని ఫుడ్ సేఫ్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహార కల్తీ, భద్రతకు సంబంధించిన…
టాలీవుడ్ స్టార్ నటి సమంత జూన్ నెల జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ‘‘జూన్ ఫెయిరీ టేల్‌లా గడిచింది’’ అంటూ సోషల్…
తిరుమలలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించి, భక్తులకు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు టీటీడీ "సైలెంట్ తిరుమల" కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.ఈ…
తొలి కార్యక్రమంగా ఫారం పాండ్ కి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , ముఖ్యమంత్రి చంద్రబాబు…