
పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో కల్లుగీత కార్మికుడు పోలరపు సింహాచలం ఇంటికి వెళ్లి పింఛను స్వయంగా అందజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రమతో కూడిన కల్లుగీత వృత్తిని గురించి, వారి ఆదాయం, జీవన విధానం గురించి తెలుసుకున్నారు. సింహాచలం కోరినట్లుగా ఆ కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. తాటి చెట్టు ఎక్కి కల్లుతీసే విధానాన్ని పరిశీలించి… వారు తీసిన తాజా కల్లును రుచి చూశారు చంద్రబాబు నాయుడు. స్వయంగా ముఖ్యమంత్రి తన ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉందని కార్మికుడు హర్షం వ్యక్తం చేశారు.
