సౌత్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అభిమానులకు చేరువగా ఉంటారు. అయితే తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో త్రిష చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ జారాలో ఆన్ లైన్ షాపింగ్ చేసిన త్రిష.. ఆ సంస్థ డెలివరీ తీరుపై మండిపడ్డారు. వరుసగా మూడుసార్లు తనకు వచ్చిన బట్టలు దుర్వాసన వచ్చాయని సీరియస్ అయ్యారు. హోమ్ డెలివరీ చేసేటప్పుడు లేదా కనీసం ప్యాక్ చేసే ముందు అయినా బట్టలు ఎలాంటి వాసన వస్తున్నాయో చూడాలని సూచించారు. ‘ డియర్ జారా.. ఒక చిన్న రిక్వెస్ట్.. మేం మరోసారి హోమ్ డెలవరీ కోసం ఆర్డర్ చేసినప్పుడు, దుస్తుల నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా చూసుకోండి. ఇప్పటికే మూడు సార్లు ఆర్డర్ చేస్తే దుర్వాసన వస్తున్న బట్టలు పంపించారు. కనీసం ప్యాక్ చేసే ముందైన ఆ బట్టలు ఎలాంటి వాసన వస్తున్నాయనేది చూడండి’ అంటూ పోస్టులో రాసుకొచ్చారు త్రిష. ఇప్పుడు ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తమిళం, మలయాళంలో ప్రాజెక్టులకు ఓకే చెప్పారని తెలుస్తోంది.
షార్లెట్, నార్త్ కరోలినా: ఉత్తర అమెరికాలోని తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రతిష్ఠాత్మక తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్…
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడా.. ఎప్పుడా.. అని ఎదురుచూస్తోన్న క్షణం వచ్చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి రంగం…
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తోన్న చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్…
కోలీవుడ్‌లో హిట్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు నిర్మాతగా మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘కూలీ’, ‘లియో’…
టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం 'పెద్ది'. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు…
మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాంటసీ ఎపిక్ చిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రం విడుదలపై తాజాగా ఆసక్తికర వార్తలు…