Categories: NRI Updates

19వ ఆటా మహాసభల్లో మెరవనున్న గ్లామర్ క్వీన్.. బాల్టిమోర్ లో సందడి చేయనున్న బిగ్ బాస్ బ్యూటీ దివి!

అమెరికన్ తెలుగు సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 19వ ఆటా కాన్ఫరెన్స్ మరియు యూత్ కన్వెన్షన్ వేడుకల్లో గ్లామరస్ యాక్ట్రెస్, ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి వడ్త్యా ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఉన్న ప్రసిద్ధ బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జులై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ మహాసభలు జరగనున్నాయి.

తన నటనతో, ఛార్మింగ్ లుక్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్న దివి, ఈ అంతర్జాతీయ వేదికపై ప్రత్యక్షంగా అలరించబోతుండటంతో అమెరికాలోని ప్రవాస తెలుగువారితో పాటు ముఖ్యంగా యూత్ వర్గాల్లో నెవర్ బిఫోర్ అనే విధంగా క్రేజ్ ఏర్పడింది. ఈ మూడు రోజుల సంబరాల్లో భాగంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, యూత్ కన్వెన్షన్ వేడుకల్లో దివి పాల్గొని ప్రవాస భారతీయులతో ముచ్చటించనున్నారు.

ప్రవాసాంధ్రుల ఐక్యతను చాటేలా, తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్లాన్ చేసిన ఈ 19వ మహాసభలకు దివి రాక ప్రధాన హైలైట్‌గా మారనుంది. గ్లామర్, ఎంటర్‌టైన్‌మెంట్ మేళవింపుతో మార్మోగనున్న బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో దివి సందడి ఈ వేడుకల జోష్‌ను రెట్టింపు చేయడమే కాకుండా, ఎన్‌ఆర్‌ఐలకు ఓ మరుపురాని అనుభూతిని అందించబోతోందని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ManaTV Team

Recent Posts

40 మంది విదేశీయుల అమెరికా పౌరసత్వం రద్దుకు చర్యలు

స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది విదేశీయుల అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు…

21 hours ago

ఫ్లైదుబాయ్‌ కోపైలట్‌ దాడిలో గాయపడిన భారతీయ పైలట్‌ ఆరోగ్యం మెరుగుపడుతోంది

ఫ్లైదుబాయ్‌ విమానంలో కోపైలట్‌ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులు…

21 hours ago

అట్లాంటాలో ఘనంగా మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026

అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆల్ఫారెట్టాలో మన అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా (MAA) ఆధ్వర్యంలో మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026 ఘనంగా…

23 hours ago

కోపం మనిషిని ఎలా పతనం చేస్తుంది? | గీత 2.63 శ్లోకం #bhagavadgita #manatv

కోపం మనిషిని ఎలా పతనం చేస్తుంది? | గీత 2.63 శ్లోకం #bhagavadgita #manatv #gita #bhagavadgitatelugu #geethaslokam #krishna…

1 day ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 6-10-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 6-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…

1 day ago

Gold Rate Today : 24K & 22K Prices Sep 6-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv

Gold Rate Today : 24K & 22K Prices Sep 6-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…

1 day ago