Find Articles

ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై క్లారిటీ

ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై క్లారిటీ

టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) సీఈవో రాజేశ్‌ మీనన్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఆయన కనీసం మరో మూడు నుంచి నాలుగేళ్ల పాటు ఆర్‌సీబీ తరఫున ఆడతారని ధీమా వ్యక్తం చేశారు.కోహ్లీ ఫిట్‌నెస్ ఏమాత్రం తగ్గలేదని, అతని రిటైర్మెంట్ ఇప్పట్లో ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు.దీంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం కన్పిస్తోంది.

ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజేశ్ మీనన్ ఈ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఆర్‌సీబీ, విరాట్ ఒకే నాణేనికి రెండు వైపుల వంటివారన్న ఆయన కోహ్లీ లేని ఆర్‌సీబీని ఊహించుకోలేనని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాబోయే మూడు, నాలుగేళ్లలో అతను ఖచ్చితంగా ఆడతారని పేర్కొన్నారు. కోహ్లీ చాలా ఫిట్‌గా ఉన్నారని తెలిపారు.ఈ ఐపీఎల్ సీజన్‌లో కోహ్లీ ఎనర్జీ, పరుగులు, దూకుడు అన్నీ చూశారు. కాబట్టి మరో నాలుగు సంవత్సరాలు ఆడుతారనడంలో ఎటువంటి సందేహం లేదు” అని వెల్లడించారు.

విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లోనే కాదు, అంతర్జాతీయ క్రికెట్‌లోనూ తనదైన ముద్ర వేశారు.కెప్టెన్సీ, నిలకడైన బ్యాటింగ్, ఉన్నతమైన ఫిట్‌నెస్ ప్రమాణాలతో భారత క్రికెట్ స్వరూపాన్నే మార్చేశారు. ఐసీసీ టెస్టు, వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో ఏకకాలంలో నంబర్ వన్ స్థానంలో నిలిచిన ఏకైక భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ భవిష్యత్తు, రిటైర్మెంట్ పై ఆర్‌సీబీ సీఈవో చేసిన కామెంట్స్ ఫ్రాంచైజీకి అతనిపై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచాయి.

ManaTV Team