Categories: Movie News

అభిమానులకు గుడ్ న్యూస్.. ‘చెన్నై లవ్‌ స్టోరీ’లో కిరణ్‌ పాత్ర పరిచయం

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ‘చెన్నై లవ్‌ స్టోరీ’ చిత్ర యూనిట్ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో కిరణ్‌ అబ్బవరం పోషిస్తున్న పాత్రను అధికారికంగా పరిచయం చేసింది. ఇందులో ఆయన ‘స్టీవెన్‌ శంకర్‌’ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు మాస్‌ మూవీ మేకర్స్‌ సంస్థ సోషల్‌ మీడియా వేదికగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.

స్టీవెన్‌ శంకర్‌గా కిరణ్‌ అబ్బవరం గుర్తుండిపోయే నటనను కనబరుస్తారు. ప్రపంచవ్యాప్తంగా జులై 24న థియేటర్లలో కలుద్దాం అంటూ చిత్రబృందం శుభాకాంక్షలు తెలిపింది. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్‌ప్లే కూడా అందించారు. కథను సాయిరాజేశ్‌ అందించగా, ఆయనే నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. ఎస్‌కేఎన్‌ మాస్‌ మూవీ మేకర్స్‌, అమృత ప్రొడక్షన్స్‌ సంస్థలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… ధీరజ్‌ మొగిలినేని సహ నిర్మాతగా వ్యవహరించారు.

రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ గా వస్తోన్న ఈ చిత్రంలో కిరణ్‌కు జోడీగా శ్రీగౌరి ప్రియ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కాగా ఈ సినిమా భారీ అంచనాల నడుమ జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ManaTV Team

Recent Posts

అందుకే ఒంటరిని… అవికా గోర్ ఎమోషనల్ పోస్ట్

'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్‌తో పరిచయమైన నటి అవిక గోర్ తాజాగా చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ అందరి…

10 hours ago

ఆర్‌సీ17లో నయనతార ఎంట్రీ?.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'ఆర్‌సీ17' సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. 'రంగస్థలం'…

11 hours ago

అభిమానులకు గుడ్‌న్యూస్‌.. జులై 23న ‘జన నాయగన్‌’ విడుదల?

తమిళనాడు సీఎం విజయ్‌ నటించిన లాస్ట్ మూవీ ‘జన నాయగన్‌’. ఈ సినిమా విడుదలపై నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు…

11 hours ago

ATA : అదరహో ఆటా.. బాల్టిమోర్ కాన్ఫరెన్స్ కి భారీ ఏర్పాట్లు!

అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరం అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 19వ కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్‌కు ముస్తాబవుతోంది.…

14 hours ago

ఘనంగా సమంత సీమంతం వేడుక.. వైరల్ అవుతున్న వీడియో..

ప్రముఖ నటి సమంత జీవితంలో మరో మధుర ఘట్టం చోటుచేసుకుంది. త్వరలో తల్లిగా మారనున్న ఆమెకు కుటుంబ సభ్యులు, అత్యంత…

16 hours ago

టీటీఏ మెగా కన్వెన్షన్‌కు రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా

తెలుగు సినీ దిగ్గజ దర్శకుల సందడికి సిద్ధమైన షార్లెట్ అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై…

1 day ago