Categories: Movie News

ఘనంగా సమంత సీమంతం వేడుక.. వైరల్ అవుతున్న వీడియో..

ప్రముఖ నటి సమంత జీవితంలో మరో మధుర ఘట్టం చోటుచేసుకుంది. త్వరలో తల్లిగా మారనున్న ఆమెకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయిన సమంత ఆనందోత్సాహాల మధ్య వేడుకలో పాల్గొనగా, ఆమెకు కుటుంబ సభ్యులు ఆశీర్వాదాలు అందించారు.

సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోరు తమ తొలి సంతానం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025 చివరిలో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంటకు ఈ ఏడాది డిసెంబర్‌లో తొలి సంతానం జన్మించనున్నట్లు సమాచారం. సీమంతం వేడుకను కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా నిర్వహించగా, సమంత తన అత్తగారితో పంచుకున్న ఆప్యాయ క్షణాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

గత జూన్‌లో జరిగిన ‘మా ఇంటి బంగారం’ సినిమా విజయోత్సవ కార్యక్రమంలో సమంత బేబీ బంప్‌తో కనిపించడంతో ఆమె గర్భవతి అనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం చిత్ర దర్శకుడు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అప్పటి నుంచి గర్భధారణకు సంబంధించిన పలు విశేషాలను సమంత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. తాజాగా సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ManaTV Team

Recent Posts

టీటీఏ మెగా కన్వెన్షన్‌కు రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా

తెలుగు సినీ దిగ్గజ దర్శకుల సందడికి సిద్ధమైన షార్లెట్ అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై…

16 hours ago

జానీ మాస్టర్-శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలపై క్లారిటీ..

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో…

17 hours ago

ATA : అమెరికాలో శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవం

అమెరికాలో జరగనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్–2026లో ఆధ్యాత్మిక వైభవానికి నాంది పలుకుతూ తొలిసారిగా…

17 hours ago

టీటీఏ మెగా కన్వెన్షన్‌లో సందడి చేయనున్న సుమ, రవి, మామ మహేష్.. షార్లెట్‌లో మూడు రోజుల వినోదోత్సవం

అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 17 నుంచి 19 వరకు నిర్వహించనున్న తెలంగాణ అమెరికన్…

19 hours ago

‘RAW NTR’ సంస్థతో సంబంధం లేదంటూ జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ క్లారిటీ!!

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘RAW NTR’ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని…

20 hours ago

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన శృతి హాసన్ ..కుటుంబ సభ్యులు ఎక్కడ?

ప్రముఖ నటి శృతి హాసన్ తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. చెన్నైలో కొనుగోలు చేసిన కొత్త ఇంట్లోకి…

23 hours ago