
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర యూనిట్ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పోషిస్తున్న పాత్రను అధికారికంగా పరిచయం చేసింది. ఇందులో ఆయన ‘స్టీవెన్ శంకర్’ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు మాస్ మూవీ మేకర్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.
స్టీవెన్ శంకర్‌గా కిరణ్ అబ్బవరం గుర్తుండిపోయే నటనను కనబరుస్తారు. ప్రపంచవ్యాప్తంగా జులై 24న థియేటర్లలో కలుద్దాం అంటూ చిత్రబృందం శుభాకాంక్షలు తెలిపింది. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్‌ప్లే కూడా అందించారు. కథను సాయిరాజేశ్ అందించగా, ఆయనే నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. ఎస్కేఎన్ మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ సంస్థలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… ధీరజ్ మొగిలినేని సహ నిర్మాతగా వ్యవహరించారు.
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ చిత్రంలో కిరణ్‌కు జోడీగా శ్రీగౌరి ప్రియ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కాగా ఈ సినిమా భారీ అంచనాల నడుమ జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
