Find Articles

ఆటా 19వ కాన్ఫరెన్స్‌లో వైభవంగా శ్రీ శివ–పార్వతుల కళ్యాణం

ఆటా 19వ కాన్ఫరెన్స్‌లో వైభవంగా శ్రీ శివ–పార్వతుల కళ్యాణం

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్‌లో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విశేష ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ శివ–పార్వతుల దివ్య కళ్యాణ మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆధ్యాత్మిక కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

భారత్ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఉత్సవ మూర్తుల సమక్షంలో, శ్రీశైలం దేవస్థానం మార్గదర్శకత్వంలో ఈ దివ్య కళ్యాణం నిర్వహించనున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తిశ్రద్ధలతో ఈ వేడుక జరగనుంది.

ఆగస్టు 2, 2026న అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 8:30 గంటల నుంచి 11:30 గంటల వరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా ఆటా ఆధ్యాత్మిక కమిటీ సభ్యులు మాట్లాడుతూ, అమెరికాలో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీ శివ–పార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని దైవ ఆశీస్సులు పొందాలని కోరారు. ఆధ్యాత్మికత, సంప్రదాయం, తెలుగు సంస్కృతిని ఒకే వేదికపై ప్రతిబింబించే ఈ కార్యక్రమం కన్వెన్షన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని వారు పేర్కొన్నారు.

ManaTV Team