అమెరికాలోని జార్జియా రాష్ట్రం, రివర్‌డేల్‌లో ఉన్న హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా (HTA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 8 వారాల అష్టలక్ష్మి పూజలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ వారంలో రెండో భాగంగా శ్రీ ధాన్య లక్ష్మి దేవి ప్రత్యేక అలంకారం, కుంకుమార్చన, అభిషేకం మరియు విశేష పూజలు జూలై 10, 2026 (శుక్రవారం) నిర్వహించనున్నారు. ధాన్య లక్ష్మి దేవి అన్నపూర్ణత, సమృద్ధి, వ్యవసాయాభివృద్ధి, ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు. ఆమె అనుగ్రహంతో ప్రతి ఇంటిలో ఐశ్వర్యం, ఆనందం, సంతృప్తి నిండాలని ఆలయ నిర్వాహకులు ఆకాంక్షించారు.
కార్యక్రమ వివరాలు:
సాయంత్రం 6:00 గంటలకు: లక్ష్మీ నారాయణ హృదయం & కనకధారా స్తోత్ర పారాయణం
సాయంత్రం 7:00 గంటలకు: మహాలక్ష్మి అభిషేకం
సాయంత్రం 7:30 గంటలకు: ధాన్య లక్ష్మి అలంకారం, అష్టలక్ష్మి కుంకుమార్చన, ప్రత్యేక పూజ
రాత్రి 8:00 గంటలకు: హారతి, తీర్థప్రసాద వినియోగం
అష్టలక్ష్మి పూజల ద్వారా భక్తులు ఎనిమిది వారాల పాటు ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి దేవతల దివ్య అనుగ్రహాన్ని పొందే అవకాశం కల్పిస్తున్నట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు.
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో భాగంగా నాలుగో మ్యాచ్ ఇవాళ రాత్రి 10:00…
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ 'లెనిన్'. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ (U/A)…
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తోన్న తాజా చిత్రం 'మైసా'. ఈ సినిమా కోసం ఆమె ఒక అరుదైన సాహసం…
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్'. ఈ సినిమా విడుదలకు ఎదురైన ఆటంకాలు తొలగిపోయాయి. ఎన్నోసార్లు…
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్‌తో జరిగిన…