Categories: Sports

టీమిండియాలో భారీ మార్పులు..తిలక్ వర్మ సహా ఇద్దరికి షాక్.. ?

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో భాగంగా నాలుగో మ్యాచ్ ఇవాళ రాత్రి 10:00 గంటలకు బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో జరగనుంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన టీమ్ ఇండియా 0-2తో వెనుకబడి ఉంది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఇప్పుడు సిరీస్‌లో నిలవాలంటే ఈ నాలుగో మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా గెలవాలి.

ఈ సందర్భంగా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ప్లేయింగ్-11లో రెండు పెద్ద మార్పులు చేసేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గత కొన్ని మ్యాచ్‌లుగా వరుసగా ఫ్లాప్ అవుతున్న ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మపై వేటు పడేలా ఉంది. అతని పేలవ ఫామ్ వల్ల టీమ్‌లో ప్లేస్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు తిలక్ వర్మ ప్లేస్‌లోకి స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, గత రెండు మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్‌కు ఆడే ఛాన్స్ రాలేదు. అయితే టీమ్ ఇండియాకు ఇప్పుడు సాలిడ్ బ్యాటింగ్ లైనప్ అవసరం ఉన్న నేపథ్యంలో, సంజూని మళ్లీ టీమ్‌లోకి తీసుకునే ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

అదేవిధంగా ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంజూ శాంసన్ ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఆడాడు. కానీ ఆ తర్వాత 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడం కోసం సంజూని పక్కన పెట్టాల్సి వచ్చింది. బీహార్‌కు చెందిన ఈ యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ తన మొదటి రెండు టీ20 మ్యాచ్‌ల్లో అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ, మంచి స్టార్ట్ దొరికినా దాన్ని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌గా మార్చడంలో ఫెయిల్ అయ్యాడు. అయినా సరే, ఈ నాలుగో టీ20లో కూడా వైభవ్‌కు మరో ఛాన్స్ ఇస్తారని టాక్.

బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ లైనప్‌లో కూడా మార్పులు జరిగేలా ఉన్నాయని సమాచారం. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు గత మ్యాచ్ అస్సలు కలిసి రాలేదు. అందుకే అతని స్థానంలో స్పిన్-బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను టీమ్‌లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. సుందర్ బౌలింగ్‌లో మంచి కంట్రోల్ ఇవ్వడమే కాకుండా, టీమ్ బ్యాటింగ్‌ను కూడా బలోపేతం చేస్తారు. అక్షర్ పటేల్ భారత్ తరఫున 99 టీ20 మ్యాచ్‌లు ఆడి, 101 వికెట్లు తీసిన అక్షర్ పటేల్.. అలాగే 62 ఇన్నింగ్స్‌ల్లో 746 రన్స్ చేశారు.

నాలుగో టీ20 కోసం భారత్ ప్లేయింగ్ ఎలెవన్ అంచనా:
అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శివమ్ దూబే, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ / వాషింగ్టన్ సుందర్, ప్రిన్స్ యాదవ్.

ManaTV Team

Recent Posts

అట్లాంటా హిందూ టెంపుల్‌లో ఘనంగా అష్టలక్ష్మి పూజలు

అమెరికాలోని జార్జియా రాష్ట్రం, రివర్‌డేల్‌లో ఉన్న హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా (HTA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 8 వారాల అష్టలక్ష్మి…

2 hours ago

విడుదలకు సిద్ధమైన అక్కినేని అఖిల్ ‘ లెనిన్ ’!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ 'లెనిన్'. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ (U/A)…

4 hours ago

‘మైసా’ కోసం రష్మిక అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్..

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తోన్న తాజా చిత్రం 'మైసా'. ఈ సినిమా కోసం ఆమె ఒక అరుదైన సాహసం…

4 hours ago

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘జన నాయగన్’.. జూలై 24న విజయ్ సినిమా రిలీజ్?

తమిళనాడు సీఎం, దళపతి విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్'. ఈ సినిమా విడుదలకు ఎదురైన ఆటంకాలు తొలగిపోయాయి. ఎన్నోసార్లు…

4 hours ago

‘కలర్స్’ స్వాతి రెండో పెళ్లి.. ఆ డైరెక్టర్‌తో ఏడడుగులు!

'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…

12 hours ago

అర్జెంటీనా అద్భుత విజయం.. మెస్సీ కన్నీళ్లు !!

ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్‌తో జరిగిన…

1 day ago