Categories: Movie News

‘మైసా’ కోసం రష్మిక అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్..

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తోన్న తాజా చిత్రం ‘మైసా’. ఈ సినిమా కోసం ఆమె ఒక అరుదైన సాహసం చేశారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా నీటి అడుగున భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేశారు. ఈ ఫైట్ సీక్వెన్స్ ను ఎటువంటి డూప్ సహాయం తీసుకోకుండా రష్మిక స్వయంగా పూర్తిచేయడం గమనార్హం.

ఈ విషయాన్ని తెలియజేస్తూ రష్మిక సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికర పోస్ట్‌ చేశారు.. “నా కెరీర్‌లో ఇంతకంటే సవాలుతో కూడిన పని ఇప్పటివరకు చేయలేదు. ఈ చిత్రం కోసం మేం ఎంతో శ్రమిస్తున్నాం.. ఇదే నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది” అని పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఒక చిత్రాన్ని షేర్ చేశారు. రెండు రోజుల వ్యవధిలో దాదాపు 20 గంటల పాటు నీటి అడుగున ఈ హై-ఇంటెన్సిటీ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

రవీంద్ర పుల్ల డైరెక్షన్ లో రాబోతున్న ‘మైసా’ చిత్రం ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. గిరిజన నేపథ్యంతో సాగే ఈ కథలో రష్మిక ఒక గోండు గిరిజన యువతిగా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం రష్మిక బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా స్టంట్ శిక్షణ కూడా పొందారు. కాగా, ఈ సినిమా టీజర్ అప్‌డేట్‌ను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అంతేకాదు ఈ ఏడాదే చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది.

ManaTV Team

Recent Posts

అట్లాంటా హిందూ టెంపుల్‌లో ఘనంగా అష్టలక్ష్మి పూజలు

అమెరికాలోని జార్జియా రాష్ట్రం, రివర్‌డేల్‌లో ఉన్న హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా (HTA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 8 వారాల అష్టలక్ష్మి…

2 hours ago

టీమిండియాలో భారీ మార్పులు..తిలక్ వర్మ సహా ఇద్దరికి షాక్.. ?

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో భాగంగా నాలుగో మ్యాచ్ ఇవాళ రాత్రి 10:00…

3 hours ago

విడుదలకు సిద్ధమైన అక్కినేని అఖిల్ ‘ లెనిన్ ’!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ 'లెనిన్'. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ (U/A)…

4 hours ago

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘జన నాయగన్’.. జూలై 24న విజయ్ సినిమా రిలీజ్?

తమిళనాడు సీఎం, దళపతి విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్'. ఈ సినిమా విడుదలకు ఎదురైన ఆటంకాలు తొలగిపోయాయి. ఎన్నోసార్లు…

4 hours ago

‘కలర్స్’ స్వాతి రెండో పెళ్లి.. ఆ డైరెక్టర్‌తో ఏడడుగులు!

'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…

12 hours ago

అర్జెంటీనా అద్భుత విజయం.. మెస్సీ కన్నీళ్లు !!

ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్‌తో జరిగిన…

1 day ago