Categories: Movie News

‘జై భీమ్’ కాంబో రిపీట్..సూర్య కొత్త మూవీ

తమిళ స్టార్ హీరో సూర్య మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ‘జై భీమ్’ తర్వాత ఆయన మరోసారి దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో జతకట్టారు. ఈ సినిమా ముహూర్తపు వేడుకను జూన్ 29న చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్లను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. సూర్య, హోంబలే ఫిల్మ్స్ కాంబినేషన్‌లో ఇదే తొలి చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

కమర్షియల్ అంశాలతో కూడిన ఒక పవర్‌ఫుల్, గ్రిట్టి డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో సూర్య సరసన హీరోయిన్‌గా కయాదు లోహర్ నటిస్తోంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ఎస్.ఆర్. కతిర్ సినిమాటోగ్రాఫర్‌గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా పనిచేయనున్నారు. ఇటీవలే ‘కరుప్పు’ చిత్రంతో విజయం అందుకున్న సూర్య, ఈ కొత్త ప్రాజెక్టుతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్, విడుదల తేదీని ప్రకటించనున్నారని సమాచారం.

ఈ సినిమాపై హోంబలే ఫిల్మ్స్ ఓ ప్రకటన చేసింది. సూర్యతో తమ ప్రయాణం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పింది. ఆయన నటన, తమ నిర్మాణ విలువలు కలిసి ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నామని పేర్కొన్నారు. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంలోనే హోంబలే ఫిల్మ్స్ తరఫున ‘ది వన్ – సూర్య’కు గర్వంగా స్వాగతం పలుకుతున్నట్లు తెలిపింది.

ManaTV Team

Recent Posts

‘జననాయగన్’ రిలీజ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌?.. జులైలోనే విడుదల!

తమిళనాడు సీఎం విజయ్‌ హీరోగా చేసిన చివరి చిత్రం ‘జన నాయగన్‌’. ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత ప్రేక్షకుల…

13 minutes ago

రేపే ‘నాగబంధం’ రిలీజ్… ప్రారంభమైన అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్

భారీ అంచనాల నడుమ రాబోతున్న 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం రేపు (జులై 3) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల…

2 hours ago

స్టార్ హీరో సూర్య పొలిటికల్ ఎంట్రీ.?

తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్ మరోసారి చర్చకు దారితీసింది. నటుడు విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీతో విజయవంతం కావడంతో ఇతర…

4 hours ago

వైభవ్‌ సూర్యవంశీ అరంగేట్రం ఆలస్యం..?

ఇంగ్లాండ్‌తో తొలి టీ20లోనూ యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ విషయంపై భారత మాజీ…

5 hours ago

అమరావతి నిర్మాణాల ఖర్చుపై జగన్ సంచలన ఆరోపణలు

అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు, ఉద్యోగుల క్వార్టర్ల కోసం కడుతున్న బిల్డింగులకు చదరపు అడుగుకు అవుతున్న ఖర్చు రూ.4,645. కానీ…

19 hours ago

Pawan Kalyan: ‘భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే దూషించే హక్కు కాదు’

వాక్ స్వాతంత్ర్యం… సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan సోషల్ మీడియాలో సందేశం ఇచ్చారు. ఈ సందేశంలో…

20 hours ago