Categories: Movie News

ఖుష్బూ కూతురి పెళ్లి వేడుక… ఒకే ఫ్రేమ్‌లో చిరు, నాగ్, వెంకీ

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆమె పెద్ద కుమార్తె అవంతికతో చెన్నైకి చెందిన వ్యాపారవేత్త శ్రవణ్ శ్రీనివాసన్ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. గోవాలోని ఒక విలాసవంతమైన రిసార్ట్‌లో జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ వేడుకలో టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిన ఈ తారలంతా నూతన దంపతులతో ఫొటోలు దిగి సందడి చేశారు. వీరితో పాటు బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, కూడా పాల్గొన్నారు. వెండితెరపై ఒకరితో ఒకరు పోటీపడినప్పటికీ, నిజ జీవితంలో మంచి స్నేహితులుగా మెలిగే చిరు, నాగ్, వెంకీ.. తమ స్నేహితురాలి కుమార్తె వివాహంలో ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ManaTV Team

Recent Posts

TTA మెగా కన్వెన్షన్ 2026కు కౌంట్‌డౌన్ ప్రారంభం.. మరో 13 రోజుల్లో మహా వేడుక!

షార్లెట్, నార్త్ కరోలినా: ఉత్తర అమెరికాలోని తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రతిష్ఠాత్మక తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్…

21 hours ago

ఇంగ్లండ్‌తో రెండో టీ20.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.?

క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడా.. ఎప్పుడా.. అని ఎదురుచూస్తోన్న క్షణం వచ్చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి రంగం…

22 hours ago

అక్కినేని అఖిల్ కోసం రంగంలోకి తారక్.?

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తోన్న చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్…

23 hours ago

ఇలా మూడోసారి.. త్రిష సీరియస్

సౌత్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.…

23 hours ago

నిర్మాతగా లోకేశ్ కనగరాజ్.? ఛాన్స్ కొట్టేసిన రెజీనా!

కోలీవుడ్‌లో హిట్ డైరెక్టర్‌ లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు నిర్మాతగా మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘కూలీ’, ‘లియో’…

23 hours ago

ఓటీటీలో ‘పెద్ది’ హంగామా.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే..!

టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం 'పెద్ది'. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు…

24 hours ago