
ఫిలడెల్ఫియా: అమెరికాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెండో కన్వెన్షన్ మహాసభలు అత్యంత వైభవంగా ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ ప్రవాస తెలుగు సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా రెండో రోజు వేడుకలు కనులపండువగా సాగాయి. అమెరికా నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన తెలుగు కుటుంబాలతో ఎక్స్పో సెంటర్ అంతా పండగ వాతావరణం సంతరించుకుంది. ఈ ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథులుగా ప్రముఖ సీనియర్ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదతో పాటు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

