తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన నటుడు, నిర్మాత విశాల్ ‘డార్లింగ్ సీఎం విజయ్’ అంటూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పదవులు మారినప్పటికీ, విజయ్‌తో తనకున్న అనుబంధం మాత్రం అలాగే ఉందన్న ఆయన, విజయ్ గౌరవార్థం ఒక విద్యా స్పాన్సర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రకటించారు.
లయోలా కాలేజీ రోజుల్లో పరిచయమైనప్పటి నుంచి విజయ్‌ను “డార్లింగ్” అని పిలుస్తున్నట్లు విశాల్ తెలిపారు. విజయ్సామాన్య నటుడి నుంచి “సూపర్‌స్టార్”గా, ఆపై తమిళనాడు ముఖ్యమంత్రి గా ఎదగడం గొప్ప విషయమని కొనియాడారు. అయితే సీఎం పదవి వచ్చినా విజయ్ వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పారు. విజయ్ ను కలవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్న విశాల్.. ఆయన ఇప్పటికీ అంతే ఆప్యాయతతో పలకరించారని తెలిపారు. ఈ సందర్భంలోనే కరుణానిధి, జయలలిత, స్టాలిన్, ఉదయనిధి వంటి నేతలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఇక ముఖ్యమంత్రిని కలిసినప్పుడు సంప్రదాయంగా బొకే, శాలువా ఇవ్వకుండా ఆ ఖర్చును ముగ్గురు నిరుపేద బాలికల విద్య కోసం వినియోగించినట్లు విశాల్ తెలిపారు. ఈ సాయాన్ని సీఎం విజయ్ పేరుతో అందించినట్లు పేర్కొన్నారు. ఆ బాలికలు జీవితాంతం ఆయన్ను గుర్తుంచుకుంటారని చెప్పారు. విజయ్ పాలనలో తమిళనాడు మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
#SandeepReddyVanga About #ArjunReddy #movieupdates #viralshorts #ManTV #SandeepReddyVanga #ArjunReddy #ArjunReddyMovie #DeletedScenes #BehindTheScenes #MovieEditing #Tollywood #TeluguCinema #Vanga…
No Money, Just an Idea! Dr. M.S. Reddy’s Billion-Dollar Lesson #pizzahut #dominos #ManTVlive #DrMSReddy #PizzaHut…
How to Become a Trillionaire? The Mindset Behind Massive Success #manatvlive #Trillionaire #TrillionaireMindset #SuccessMindset #MillionaireMindset…
ఈ కథ నాకు చాలా నచ్చింది : సందీప్ రెడ్డి వంగ #Romanchakam #SandeepReddyVanga #Tollywood #manatvlive #Romanchakam #RomanchakamTrailer…
Gold Rate Today: 22K & 24K Prices | August 26 #goldrate #24kgold #22kgold #goldprice #manatvlive…
#Ashtalakshmi #AshtalakshmiIdols #LakshmiDevi #GoddessLakshmi #PoojaItems #PoojaStore #SriGayatriPoojaStores #Devotional #DivineIdols #HinduGods #PoojaDecor #SpiritualDecor #Hyderabad #Kukatpally #VaralakshmiVratam…