ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు తెలంగాణలోనూ పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు.
హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. మరోవైపు సీఈసీ కార్యాలయం ఎదుట టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు నిరసనలో పాల్గొన్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై పార్లమెంటులో తొలగింపు తీర్మానం తీసుకురావడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నట్లు సెప్టెంబర్ 24న ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది