Find Articles

సామాన్యుడికి షాక్.. పాల నుంచి నిత్యావసర వస్తువుల వరకు పెరిగిన ధరలు

సామాన్యుడికి షాక్.. పాల నుంచి నిత్యావసర వస్తువుల వరకు పెరిగిన ధరలు

దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతుండటంతో సామాన్యులపై ఆర్థిక భారం పెరుగుతోంది. పాలు, నెయ్యి, వెన్నతో పాటు సబ్బులు, డిటర్జెంట్లు, డ్రై ఫ్రూట్స్, పప్పుల ధరలు కూడా పెరగడంతో గృహ బడ్జెట్‌పై ప్రభావం పడుతోంది.

ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థలు అమూల్, మదర్ డెయిరీ పాల ధరలను పెంచాయి. నెయ్యి, వెన్న ధరలు కూడా అధికమయ్యాయి. దీంతో ప్రతిరోజూ పాలు, పాల ఉత్పత్తులు కొనుగోలు చేసే వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.

మరోవైపు హిందుస్థాన్ యూనిలివర్ సంస్థ సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ డిటర్జెంట్లతో పాటు మోతీ సబ్బు ధరలను పెంచింది. డాబర్ ఉత్పత్తుల ధరలు కూడా పెరిగాయి. దీంతో గృహావసరాల కోసం ఖర్చు చేసే మొత్తం మరింత పెరగనుంది.

ఇక ఐటీసీ సంస్థ గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం సిగరెట్ ప్యాక్ ధరను రూ.10 పెంచింది. అటు ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రెండు నెలల వ్యవధిలో రూ.72.50 పెరిగింది.

ఇదిలా ఉంటే డ్రై ఫ్రూట్స్, కందిపప్పు, శనగల ధరలు కూడా ఎగబాకుతున్నాయి. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి, సామాన్య కుటుంబాలకు ఈ ధరల పెరుగుదల మరింత భారంగా మారుతోంది. నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంతో నెలవారీ కుటుంబ బడ్జెట్‌ను నిర్వహించడం వినియోగదారులకు సవాలుగా మారుతోంది.

ManaTV Team