అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ఆధ్వర్యంలో ‘శివ శంభో స్వయంభో’ పేరుతో అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించనున్నారు. సంగీతం, నృత్యం, నాటకం, రంగస్థల కళల సమ్మేళనంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
2026 డిసెంబర్ 6వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ వేడుక జరగనుంది. ఆల్డీలోని విల్లార్డ్ మిడిల్ స్కూల్‌లో ఈ కార్యక్రమానికి వేదికను ఏర్పాటు చేశారు.
నాట్యమార్గం – ఇంద్రాణి సహకారంతో ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఇందులో శివతత్వం, భక్తి భావాలను సంగీతం, నృత్య రూపకాల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించి దర్శకుడిగా ఇంద్రనీల్, క్రియేటివ్ డైరెక్టర్‌గా వర్షిణి వ్యవహరిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు TANA అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, కల్చరల్ కోఆర్డినేటర్ సాయి సుధా పలడుగు సహా TANA నాయకత్వ బృందం ఏర్పాట్లు చేస్తోంది.
ఈ ప్రదర్శనను వీక్షించాలనుకునే వారు పోస్టర్‌లోని QR కోడ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
వేదిక: Willard Middle School, 40915 Braddock Road, Aldie, Virginia 20105.
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం బ్రిడ్జ్‌వాటర్ కామన్స్ మాల్‌లో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రిడ్జ్‌వాటర్ కామన్స్ మాల్ సహకారంతో,…
హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా అమరావతిలో రైల్వే స్టేషన్ నిర్మించాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు జాతీయ హైస్పీడ్ రైల్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం (నవంబర్ 19) సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన…
సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబంతో కలిసి గ్రీస్‌లో సరదాగా గడిపారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహ వేడుకకు హాజరైన…
ఇరాన్ 1950ల నుంచి నిర్మిస్తున్న వందలాది డ్యామ్‌ల వెనుక రహస్య సైనిక ఉద్దేశాలు ఉన్నాయంటూ తాజా పరిశోధనలో ఆసక్తికర అంశాలు…
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కోలో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ…