అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ఆధ్వర్యంలో ‘శివ శంభో స్వయంభో’ పేరుతో అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించనున్నారు. సంగీతం, నృత్యం, నాటకం, రంగస్థల కళల సమ్మేళనంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
2026 డిసెంబర్ 6వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ వేడుక జరగనుంది. ఆల్డీలోని విల్లార్డ్ మిడిల్ స్కూల్‌లో ఈ కార్యక్రమానికి వేదికను ఏర్పాటు చేశారు.
నాట్యమార్గం – ఇంద్రాణి సహకారంతో ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఇందులో శివతత్వం, భక్తి భావాలను సంగీతం, నృత్య రూపకాల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించి దర్శకుడిగా ఇంద్రనీల్, క్రియేటివ్ డైరెక్టర్‌గా వర్షిణి వ్యవహరిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు TANA అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, కల్చరల్ కోఆర్డినేటర్ సాయి సుధా పలడుగు సహా TANA నాయకత్వ బృందం ఏర్పాట్లు చేస్తోంది.
ఈ ప్రదర్శనను వీక్షించాలనుకునే వారు పోస్టర్‌లోని QR కోడ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
వేదిక: Willard Middle School, 40915 Braddock Road, Aldie, Virginia 20105.