టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ‘పుష్ప 2’ తరువాత ఇంతవరకూ తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించలేదు. రామ్ చరణ్ హీరోగా సుక్కు ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లడానికి కాస్త టైమ్ పట్టేలా ఉంది. అయితే ఈ గ్యాప్ లో సుకుమార్ తన నిర్మాణంలో సరికొత్త చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా ‘ ఇడుపు కాయితం ’ అనే సినిమాని ప్రకటించారు.
ప్రియదర్శి హీరోగా బీవీ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ‘ఇడుపు కాయితం’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో జానపద గాయని నాగ దుర్గ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను సుకుమార్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమవగా.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి విషెస్ చెప్పారు. అల్లు అరవింద్, దిల్ రాజుతో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
షార్లెట్, నార్త్ కరోలినా: ఉత్తర అమెరికాలోని తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రతిష్ఠాత్మక తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్…
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడా.. ఎప్పుడా.. అని ఎదురుచూస్తోన్న క్షణం వచ్చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి రంగం…
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తోన్న చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్…
సౌత్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.…
కోలీవుడ్‌లో హిట్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు నిర్మాతగా మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘కూలీ’, ‘లియో’…
టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం 'పెద్ది'. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు…