Find Articles

భారీగా పెరిగిన బంగారం ధరలు.. రూ.1,030 ఎగబాకిన 24 క్యారెట్ల గోల్డ్ రేట్!

భారీగా పెరిగిన బంగారం ధరలు.. రూ.1,030 ఎగబాకిన 24 క్యారెట్ల గోల్డ్ రేట్!

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. సోమవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,030 పెరిగి రూ.1,44,600కు చేరింది.

అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.950 పెరిగి రూ.1,32,550 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి ధర విషయానికి వస్తే.. కిలో వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,05,000 వద్ద స్థిరంగా ఉంది.

బంగారం ధరలు భారీగా పెరగడంతో కొనుగోలుదారులపై అదనపు భారం పడుతోంది. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ధరల పెరుగుదలతో ఆందోళన చెందుతున్నారు.

అయితే ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు స్థానిక జువెలరీ షాపుల్లో తాజా ధరలను తెలుసుకోవాలని సూచిస్తున్నాము.

ManaTV Team