
అధికారం చేపట్టి చంద్రబాబు చేసిన ఐదు తొలి సంతకాల్లో మెగా డీఎస్సీ ఒకటి. ఇది మెగా డీఎస్సీ ఎలా అవుతుంది? అందులో 6,100 పోస్టులు మేము ఇచ్చిన నోటిఫికేషనే. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మా ప్రభుత్వ హయాంలో ఒకే ఒక్క నోటిఫికేషన్ తో ఎలాంటి లోపాలూ లేకుండా 1,30,000 ఉద్యోగాల భర్తీ చేయడం అసలైన రికార్డ్ అని చంద్రబాబు తెలుసుకోవాలని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన స్పోర్ట్స్ కోటా స్కామ్ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. స్పోర్ట్స్ కోటాతోనే స్పోర్ట్స్ పర్సన్ ను ఎలా అన్యాయం చేయొచ్చు అనేదానికి ఉదాహరణ ఈ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా స్కామ్. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు డీఎస్సీ రాయాల్సిన అవసరం లేదని జీవో నెంబర్ 4 మరియు జీవో నెంబర్ 47 ఇచ్చారు. కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఆధారంగా సబ్జెక్ట్ టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశాడు. తమకు కావాల్సిన వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాక మరోజీవో తెచ్చి పాత జీవోలు రద్దు చేశాడు. స్పోర్ట్స్ కోటా విషయంలో జీవోలు ఎందుకు రద్దు చేశాడో చంద్రబాబు సమాధానం చెప్పాలని వైయస్ జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు ఒక్కటే చెప్తున్నా… ఇప్పుడు మనం Gen- Zలో ఉన్నాం. తప్పులు చేసి కూడా ఒప్పుకోకుండా.. ఇబ్బందులు పెడితే కాక్రోచ్ లు లేస్తాయి , ఏపీలో మేము కూడా కాక్రోచ్ లమే…అంటూ వైకాపా అధినేత ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

