Find Articles

మోదీపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ ఒక దేశద్రోహి అంటూ విమర్శించారు. రాయ్ బరేలి పర్యటనలో ఉన్న ఆయన మోదీ, అమిత్ షాతో పాటు ఆర్ఎస్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశాన్ని ప్రధాని అమెరికాకు అమ్మేస్తున్నారని రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజులలో దేశంలో అతిపెద్ద ఆర్థిక తుఫాను రాబోతోందని, అది సామాన్య ప్రజల జీవితాలను పూర్తిగా విధ్వంసం చేస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే దేశంలో రెండుసార్లు పెట్రోల్, డీజిల్ పెరగ్గా.. త్వరలోనే మరోసారి పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయని రాహుల్ గాంధీ తెలిపారు. దీని వల్ల నిత్యావసరాలు సైతం సామాన్యులకు అందని ద్రాక్షల్లా మారుతున్నాయన్నారు. దేశాన్ని మోదీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి.. ఇప్పుడు తప్పు ఒప్పుకోకుండా తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. సామాన్య ప్రజలు బంగారం కొనవద్దని, విదేశాలకు వెళ్లవద్దని బహిరంగంగా చెప్పే ప్రధాని మోదీ.. తాను మాత్రం స్వయంగా వేల కోట్ల రూపాయల విలువైన ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలు చేస్తున్నారని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.

ManaTV Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *