Find Articles

తెలంగాణలో ఎప్‌సెట్ ఫలితాలు విడుదల

తెలంగాణలో ఎప్‌సెట్ ఫలితాలు విడుదల

తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్‌సెట్ (EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య వి. బాలకిష్టారెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ఫలితాలను విడుదల చేశారు. ఈ మేరకు విద్యార్థులు eapcet.tgche.ac.in వెబ్‌సైట్‌లో ర్యాంకులను తెలుసుకోవచ్చు.

ఈ సంవత్సరం పరీక్ష రాసిన వెంటనే ప్రాథమిక ‘కీ’ ఆధారంగా కంప్యూటర్‌ స్క్రీన్‌పైనే మార్కులు కనిపించేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అదే కాదు పరీక్షలు పూర్తయిన కేవలం ఆరో రోజే ఫలితాలను విడుదల చేస్తుండటం విశేషం. ఇక ఈ ఏడాది ఇంజినీరింగ్‌ విభాగంలో 1,97,241 మంది, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో 84,954 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఎప్ సెట్ ఫలితాలలో ఉప్పల్ కు చెందిన ఎం. రుషి ఫస్ట్‌ ర్యాంక్‌ (156.64/160) సాధించగా.. మూసాపేటకు చెందిన అన్షుల్‌ రెండో ర్యాంక్‌ సాధించారు.

ManaTV Team