Find Articles

‘పవన్ కల్యాణ్ ’ అసలు పేరు కాదు.. ఒరిజినల్ నేమ్ రివీల్ చేసిన పవర్ స్టార్

‘పవన్ కల్యాణ్ ’ అసలు పేరు కాదు.. ఒరిజినల్ నేమ్ రివీల్ చేసిన పవర్ స్టార్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు. అయితే ఆయన అసలు పేరు పవన్ కల్యాణ్ కాదు అనే విషయం చాలా మందికి తెలిసినప్పటికీ, ఆ పేరు ఆయనకు ఎలా వచ్చింది.? అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. తాజాగా ఆయన పేరు వెనకున్న ఇంట్రెస్టింగ్ విషయాలను పవన్ కల్యాణ్ స్వయంగా పంచుకున్నారు. ప్రస్తుతం ఆ విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పవన్ కల్యాణ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంలోనే తనకు బారసాల రోజు పెట్టిన పేరు ‘శ్రీ కల్యాణ్ కుమార్’ అని చెప్పారు. ఆ తరువాత స్కూల్ రికార్డుల్లో చేర్చే సమయానికి శ్రీ అనే పదాన్ని తొలగించి, కేవలం కల్యాణ్ కుమార్ అని రిజిస్టర్ చేశారని తెలిపారు. మరి కల్యాణ్ కుమార్ కాస్తా పపన్ కల్యాణ్ ఎలా అయ్యారనే దానికి పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ చెప్పారు.

తనకు చిన్నతనం నుంచి మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం, ఆసక్తి ఉండేదని చెప్పారు. ట్రైనింగ్ తీసుకునే రోజుల్లో తాను కఠినమైన విన్యాసాలు చేసేవాడిని. నా ఛాతీపై వందల కిలోల బరువున్న బండరాళ్లను పెట్టుకుని వాటిని సుత్తితో పగలగొట్టించేవాడిని. నా శారీరక ధృడత్వాన్ని, అంకితభావాన్ని చూసి.. తన మార్షల్ ఆర్ట్స్ గురువు తన పేరుకు ముందు పవన్ అనే పదాన్ని చేర్చారని తెలిపారు. అలా గురువు ఇచ్చిన ‘పవన్’ అనే పేరునే స్క్రీన్ నేమ్ గా మార్చుకున్నట్లు వెల్లడించారు. ఆ తరువాత అభిమానులు పవర్ స్టార్ అనే బిరుదు కూడా తోడైంది. దీంతో టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గా పిలువబడుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, పవన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజాసేవలో బిజీగా ఉన్నారు. మొత్తంగా తన పేరు వెనకున్న రియల్ స్టోరీని ఆయనే బయటపెట్టడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ManaTV Team