Find Articles

‘పెద్ది’ రికార్డుల ఊచకోత.. ఆరు రోజుల్లోనే రూ. 332 కోట్లకు పైగా గ్రాస్

‘పెద్ది’ రికార్డుల ఊచకోత.. ఆరు రోజుల్లోనే రూ. 332 కోట్లకు పైగా గ్రాస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘పెద్ది’. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 332.1 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి దూసుకుపోతోంది.

జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన పెద్ది సినిమా తొలిరోజు నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా వసూళ్ల వివరాలను నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ అధికారికంగా ప్రకటిస్తూ ప్రత్యేక పోస్టర్స్ ను విడుదల చేస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకుల నుంచే కాదు విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు దక్కుతున్నాయి. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించగా, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ, రవికిషన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు.

ManaTV Team