
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, తన సొంత బ్యానర్ ‘ట్రాలాల మూవింగ్ పిక్చర్స్’ పతాకంపై తెరకెక్కించిన చిత్రం ‘ మా ఇంటి బంగారం’. ఈ సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనానికి తెరతీసింది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కమ్ ఫ్యామిలీ డ్రామా థియేట్రికల్ రన్ కు ముందే పెట్టిన వెనక్కి రాబట్టింది. అంతేకాదు లాభాల జోన్ లోకి ప్రవేశించింది.
దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాను రూ.25 కోట్ల నుంచి రూ. 30 కోట్ల మధ్య బడ్జెట్ తో నిర్మించారని తెలుస్తోంది. అయితే సామ్ క్రేజ్, కమర్షియల్ కంటెంట్ పై ఉన్న నమ్మకంతో నాన్ థియేట్రికల్ హక్కులకు మార్కెట్ లో ఊహించని డిమాండ్ ఏర్పడింది. ఈ మేరకు ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ రూపంలోనే ఈ చిత్రం రూ.35 కోట్ల వరకు ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తోంది. రిలీజ్ వారంలోనే అన్ని రకాల వ్యాపార ఒప్పందాలు సక్సెస్ ఫుల్ గా క్లోజ్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పూర్తిగా సేఫ్ జోన్ లోకి వచ్చేసింది. అంటే ఇకపై థియేటర్లలో వచ్చే వసూళ్లన్నీ నిర్మాతగా సమంతకు అదనపు లాభాలుగా మారనున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద విడుదలకు ముందే లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

