Find Articles

తిరుమలలో ‘మా ఇంటి బంగారం’ టీమ్ సందడి

తిరుమలలో ‘మా ఇంటి బంగారం’ టీమ్ సందడి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంలోనే చిత్ర యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.

వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో నటి సమంత, ఆమె భర్త, చిత్ర నిర్మాత అయిన రాజ్ నిడిమోరు, దర్శకురాలు నందిని రెడ్డి, యాంకర్ శ్రీముఖి తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న చిత్ర బృందానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

నందిని రెడ్డి డైరెక్షన్ లో ఫ్యామిలీ యాక్షన్ కామెడీ డ్రామాగా రాబోతున్న ‘మా ఇంటి బంగారం’ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రమోషన్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ManaTV Team