Find Articles

క్రేజీ మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకీ, కళ్యాణ్ రామ్

క్రేజీ మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకీ, కళ్యాణ్ రామ్

టాలీవుడ్ లో కమర్షియల్ వినోదానికి, మరీ ముఖ్యంగా సంక్రాంతి సీజన్ కు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన తన నెక్ట్స్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా తెరకెక్కతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి.#VenkyAnil5, #NKRAR2 అనే వర్కింగ్ టైటిల్స్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన కీర్తి సురేశ్, కళ్యాణ్ రామ్ సరసన యంగ్ బ్యూటీ కృతిశెట్టి కనిపించనున్నారు.

అనిల్ రావిపూడి సినిమా ప్రమోషన్లు, చేసే ఈవెంట్లు డిఫరెంట్ గా ఉంటాయనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మల్టీ స్టారర్ పూజా కార్యక్రమంలోనూ ఆయన డిఫరెంట్ మార్క్ కనిపించింది. ఈ సారి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఫస్ట్ సీన్ డైరెక్ట్ చేయగా.. అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ఫస్ట్ వెంకీ పక్కన కృతి శెట్టి, కళ్యాణ్ రామ్ పక్కన కీర్తి సురేష్ నిలబడి ఉంటారు. వీళ్లు ఒకరినొకరు చూసుకుని కన్ఫ్యూజ్ అయిపోయి, వెంటనే ఎవరి బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వాళ్లు వస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో తీసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో అనిల్ రావిపూడి దాదాపు రూ.300 కోట్ల వసూళ్లు సాధించి పీక్ ఫామ్‌లో ఉన్నారు. ఇప్పుడు అదే జోష్ లో వెంకటేష్- కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ సినిమాను వచ్చే 2027 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంచితే, వెంకటేష్‌కు ఫ్యామిలీ, క్లాస్ ఆడియన్స్‌లో తిరుగులేని పట్టుంది. అదే సమయంలో కళ్యాణ్ రామ్ వైవిధ్యమైన సినిమాలతో పాటు నందమూరి మాస్ బ్రాండ్ ఇమేజ్‌ను కలిగి ఉన్నారు. ఈ క్లాస్, మాస్ ఈక్వేషన్‌కు అనిల్ రావిపూడి మార్క్ అవుట్ అండ్ అవుట్ హిల్లేరియస్ కామెడీ తోడైతే సంక్రాంతి వంటి బిగ్గెస్ట్ సీజన్‌లో థియేటర్లలో కలెక్షన్ల సునామీ రావడం ఖాయం.

ManaTV Team