Find Articles

అభిమానులకు గుడ్‌న్యూస్‌.. జులై 23న ‘జన నాయగన్‌’ విడుదల?

అభిమానులకు గుడ్‌న్యూస్‌.. జులై 23న ‘జన నాయగన్‌’ విడుదల?

తమిళనాడు సీఎం విజయ్‌ నటించిన లాస్ట్ మూవీ ‘జన నాయగన్‌’. ఈ సినిమా విడుదలపై నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. జులై 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. విదేశాల్లో మాత్రం జులై 24 నుంచి ప్రదర్శించనున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇటీవలే ఈ చిత్రానికి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) ‘ఏ’ సర్టిఫికెట్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జులై 9న సర్టిఫికేషన్‌ పూర్తికాగా, సినిమా నిడివి 3 గంటల 3 నిమిషాల 11 సెకన్లుగా నమోదైంది. విడుదలకు ముందు చిత్రంలో 12 మార్పులు చేయాలని సెన్సార్‌ బోర్డు సూచించగా, ఆ మార్పులు చేసిన తర్వాతే సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలిసింది.

హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించింది. విజయ్‌తో పాటు పూజా హెగ్డే, బాబీ డియోల్‌, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్‌ నటుడిగా కనిపించనున్న చివరి చిత్రం కావడంతో ‘జన నాయగన్‌’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ManaTV Team