Find Articles

అందుకే ఒంటరిని… అవికా గోర్ ఎమోషనల్ పోస్ట్

అందుకే ఒంటరిని… అవికా గోర్ ఎమోషనల్ పోస్ట్

‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్‌తో పరిచయమైన నటి అవిక గోర్ తాజాగా చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే అవిక.. ఈసారి తన జీవితంలోని మరో కోణాన్ని అభిమానులతో పంచుకున్నారు. కెరీర్ కోసం తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల కోల్పోయిన వ్యక్తిగత బంధాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జీవితంలో విజయం సాధించినా, కొన్ని సందర్భాల్లో మనసుకు కావాల్సిన మనుషులు దూరమవుతారని అవిక పేర్కొన్నారు. “చుట్టూ ఎంతమంది ఉన్నా.. మనల్ని నిజంగా అర్థం చేసుకునే వాళ్లు లేకపోతే అదే అసలైన ఒంటరితనం” అంటూ ఆమె తన భావాలను వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్లో, తమ స్నేహితుల వర్గాల్లో బిజీగా ఉండిపోవడంతో.. కొత్తగా ఎవరికైనా దగ్గరవడం అంత సులభం కాదని ఆమె చెప్పారు.
తన జీవితంలో ఎక్కువ సమయం కెరీర్‌కే కేటాయించానని, అదే సమయంలో వ్యక్తిగత సంబంధాలను కాపాడుకోవడానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేకపోయానని అవిక వెల్లడించారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే బంధాలను నిలబెట్టుకోవడం కూడా విజయంతో సమానంగా ముఖ్యమని అర్థమైందని చెప్పారు.

తన అనుభవాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా అభిమానులతో పంచుకున్న అవిక గోర్‌కు సోషల్ మీడియాలో భారీగా మద్దతు లభిస్తోంది. “ఇది చాలా మంది జీవితాల్లో కనిపించే వాస్తవం” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ManaTV Team