Find Articles

విశాఖలో రూ.2,000 కోట్లతో AIG హాస్పిటల్

విశాఖలో రూ.2,000 కోట్లతో AIG హాస్పిటల్

విశాఖపట్నంలో సుమారు 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో AIG హాస్పిటల్ నిర్మాణం చేపడుతోంది.ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 9,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.9 ఎకరాల క్యాంపస్‌లో 1,000 పడకలతో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనుంది.
మొదటి దశలో 650 పడకలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.2028 నాటికి అందుబాటులోకి రానున్న ఈ ప్రాజెక్ట్, విశాఖపట్నాన్ని మెడికల్ హబ్‌గా మరింత అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.

ManaTV Team