దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. నెల రోజుల క్రితం కిలో ఉల్లి రూ.30–50 మధ్య ఉండగా, ప్రస్తుతం రూ.70–80 వరకు చేరింది. తెల్ల ఉల్లి ధర అయితే కిలో రూ.100 దాటింది.
హైదరాబాద్‌లోని మలక్‌పేట హోల్‌సేల్ మార్కెట్‌లో క్వింటా ఉల్లి ధర రూ.4,500 నుంచి రూ.5,200 వరకు పలుకుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో ఎల్‌నినో ప్రభావంతో దిగుబడి తగ్గడం, డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
స్థానికంగా పండించిన కొత్త ఉల్లి పంట మార్కెట్‌లోకి వచ్చే వరకు ధరలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.