ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో పట్టుదలగా ఉన్నారని ఆయన ప్రత్యేక ప్రతినిధి జారెడ్ కుష్నర్ తెలిపారు.
సోమవారం కీవ్‌లో జరిగిన చర్చల అనంతరం కుష్నర్ మాట్లాడుతూ.. సమస్య ఎంత క్లిష్టమైనదైనా, దానికి పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంటే పూర్తి శక్తితో ప్రయత్నించాలని ట్రంప్ స్పష్టంగా చెబుతుంటారని అన్నారు.
యుద్ధం, ప్రాణనష్టానికి ముగింపు పలకడంతో పాటు.. యుద్ధం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఉపశమనం కల్పించడమే ట్రంప్ ప్రధాన లక్ష్యమని కుష్నర్ పేర్కొన్నారు.