Find Articles

మాళవిక మోహనన్‌కు త్రిష ప్రత్యేక అభినందనలు.. “ఆమె లాంటి వారు ఇండస్ట్రీలో చాలా అరుదు”

మాళవిక మోహనన్‌కు త్రిష ప్రత్యేక అభినందనలు.. “ఆమె లాంటి వారు ఇండస్ట్రీలో చాలా అరుదు”

తన కెరీర్‌లో నటి త్రిష ఎంతో ప్రోత్సాహాన్ని అందించారని మాళవిక మోహనన్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ‘పేట’ సినిమాలో త్రిషతో కలిసి పనిచేసిన సమయంలో ఆమె తనను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని గుర్తుచేసుకున్నారు.

ఆ తర్వాత విజయ్ సరసన ‘మాస్టర్’ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు త్రిష ప్రత్యేకంగా మెసేజ్ చేసి అభినందించారని మాళవిక తెలిపారు.

“బేబీ.. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని త్రిష చెప్పినట్లు ఆమె వెల్లడించారు.

కొత్తవారిని ప్రోత్సహించడంలో త్రిష ఎప్పుడూ ముందుంటారని, ఆమెలాంటి వ్యక్తులు సినీ పరిశ్రమలో చాలా అరుదుగా ఉంటారని మాళవిక ప్రశంసించారు.

ManaTV Team