పాకిస్థాన్: రావల్పిండిలో ప్రముఖ టీవీ యాంకర్ రబియా అహ్సాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. తన నివాసంలోనే ఆమె తుపాకీ కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఆదివారం గుల్షన్ఆబాద్ ప్రాంతంలోని ఆమె ఇంట్లో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనకు సంబంధించి అనుమానిత తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రబియా అహ్సాన్ భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తుపాకీ ప్రమాదవశాత్తూ పేలడంతోనే ఈ ఘటన జరిగిందని ఆమె భర్త చెబుతున్నట్లు సమాచారం.
అయితే ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటననా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.