Categories: Telangana

పోలీస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు.. రిటైర్మెంట్ వరకు ఫిట్‌నెస్ తప్పనిసరి!

ప్రొబెషనరీ డీఎస్పీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. పోలీస్ అధికారులు ఉద్యోగంలో చేరినప్పుడు ఎలాంటి శారీరక దృఢత్వంతో ఉన్నారో.. రిటైర్మెంట్ వరకు అదే ఫిట్‌నెస్‌ను కొనసాగించాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలీస్ అధికారుల బెల్ట్ ఎప్పుడూ టైట్‌గానే ఉండాలని, బెల్ట్ లూజ్ కాకుండా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలని సూచించారు. బెల్ట్ లూజ్ అయితే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదంటూ చమత్కరించారు.

ఈ ఫిట్‌నెస్ నిబంధన కేవలం పోలీసులకే కాకుండా రాజకీయ నాయకులకు కూడా వర్తిస్తుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచి సర్వీస్ చివరి రోజు వరకు ప్రతి పోలీస్ అధికారి నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

ManaTV Team

Recent Posts

రైతులకు కేంద్రం శుభవార్త.. ఎరువుల సబ్సిడీకి రూ.62,370 కోట్లు ఆమోదం

రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబర్ 11న జరిగిన…

6 hours ago

లండన్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. ఒక్కచోట చేరిన పలు దేశాల ప్రజలు

వెలుగుల పండుగ దీపావళి వేడుకలు లండన్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. వివిధ దేశాలు, సంస్కృతులకు చెందిన ప్రజలంతా ఒక్కచోట చేరి…

9 hours ago

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన.. ‘పరివర్తన రాజనీతి పార్టీ’గా నామకరణం

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీతో ముందుకొచ్చారు. విజయవాడ వేదికగా బుధవారం తన నూతన రాజకీయ పార్టీ…

9 hours ago

కమల్ హాసన్ కొత్త సినిమా ‘సండియార్’పై వివాదం.. టైటిల్ మార్చాలంటూ డిమాండ్

ప్రముఖ నటుడు కమల్ హాసన్ కొత్త సినిమా టైటిల్ తమిళనాడులో వివాదానికి దారితీసింది. తన 72వ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన…

9 hours ago

రూ.500, రూ.1000, రూ.2000 నోట్లు రద్దు చేయాలా? చంద్రబాబు కీలక డిమాండ్.. దేశవ్యాప్తంగా చర్చ

అవినీతి, నల్లధనాన్ని అరికట్టేందుకు అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

11 hours ago

న్యూయార్క్‌లో ‘హర హర మహాదేవ’.. స్వర వీణాపాణి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత విభావరి

అమెరికాలోని న్యూయార్క్‌లో ఆధ్యాత్మికత, సాహిత్యం, సంగీతాల సమ్మేళనంగా ‘హర హర మహాదేవ – శివ తత్వాలు’ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు…

11 hours ago